హిందూ శ్మశానం వాటికలో అక్రమంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేస్తూ 50 కాలనీలు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ధర్నాలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్మశానంలో అక్రమ డంపింగ్ యార్డ్ కట్టడాలను కూల్చివేస్తామన్నారు. ఇదే సమస్యపై ఇప్పటికే మూడు సార్లు కాలనీవాసులకు మద్దతుగా వచ్చినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం జరగకపోవడం బాధాకరమన్నారు.