TG: బీసీలను అణచివేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కులగణన చేయలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సామాజిక న్యాయం కోసం పారదర్శకంగా పనిచేస్తోన్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే రాజకీయ రిజర్వేషన్లు, బీసీ సాధికారత, బీసీ డిక్లరేషన్ అమలుపై బీసీ సంఘాల నుంచి సూచనలు స్వీకరించిన మంత్రి.. వాటిపై సీఎంతో చర్చించనున్నట్లు మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.