ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొంటాం: ఎమ్మెల్యే కడియం

74చూసినవారు
ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొంటాం: ఎమ్మెల్యే కడియం
TG: రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొంటామని స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పందిస్తూ కడియం ఈ మేరకు వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరసావహిస్తానని చెప్పారు. కానీ భయంతో పారిపోనని తెలిపారు. పదేళ్లలో 36 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను BRS లాక్కుని, కొందరికి మంత్రి పదవులు సైతం ఇచ్చిందని మండిపడ్డారు. BRSకు ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్