వ్యక్తి గత డేటా తప్ప.. ఏదైనా ఇస్తాం: సీఎం రేవంత్

59చూసినవారు
వ్యక్తి గత డేటా తప్ప.. ఏదైనా ఇస్తాం: సీఎం రేవంత్
కులగణన నివేదికలోని వ్యక్తి గత డేటా తప్ప ఏదైనా ఇస్తామని, వ్యక్తిగత డేటాతో అసెంబ్లీ బిల్లు ప్రవేశ పెట్టలేమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 'కులగణన రిపోర్ట్ లో 4 భాగాలు ఉన్నాయి. నాలుగో భాగంలో వ్యక్తిగత డేటా ఉంటుంది. రిపోర్ట్ లోని నాలుగో భాగం మినహా 3 భాగాలు సభలో పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల వ్యక్తిగత వివరాల్లో గోప్యత ఉండాలి. ప్రైవసీకి సంబంధించిన అంశం కాబట్టి పూర్తి వివరాలు వెల్లడించలేదు' అని అసెంబ్లీలో CM వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్