ఏపీలోని విద్యార్థుల సంఖ్య ఖచ్చితత్వాన్ని తెలుసుకునేందుకు 'ఆపార్ కార్డ్' విధానాన్ని తెస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ ఔట్స్ నివారణకు ప్రత్యేక వ్యవస్థ తీసుకొస్తున్నామని తెలిపారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూడా త్వరలో విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.