కరీంనగర్ డంప్ యార్డ్‌ను ఎత్తేస్తాం: మనోహర్ లాల్ కట్టర్

63చూసినవారు
కరీంనగర్ డంప్ యార్డ్‌ను ఎత్తేస్తాం: మనోహర్ లాల్ కట్టర్
కరీంనగర్ డంప్ యార్డ్‌ను ఎత్తేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ స్పష్టం చేశారు. కరీంనగర్ సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. 'తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లను మంజూరు చేస్తాం. అందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రమే మంజూరు చేస్తుంది. విద్యుత్ విషయంలోనూ తెలంగాణకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్లను నిర్మించబోతున్నాం' అని వ్యాఖ్యానించారు.