TG: హైదరాబాద్‌లో ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన ఫాతిమా కాలేజీ సలకం చెరువు FTLలో నిర్మించిన సంగతి తెలిసిందే. దీంతో దాన్ని కూల్చివేయాలని ఎన్నో డిమాండ్లు వస్తున్నాయి. దానిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ.. 'అక్బరుద్దీన్‌పై దశాబ్దం క్రితం జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజీని నిర్మించారు. అందులో చాలా మంది ఉచితంగా చదువుకుంటున్నారు. ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది. మేము జీవితాలను నాశనం చేయం. ఫైనల్ రిపోర్ట్ రానివ్వండి" అని అన్నారు.