AP: గిరిజనుల ఆందోళనపై ‘ఎక్స్’ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం తొలగించే ఉద్దేశం లేదని తెలిపారు. గిరిజనుల హక్కులను కాపాడతాం. గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడటమంటే దేశ సంస్కృతిని కాపాడటమేనన్నారు. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్నాము.” అంటూ ట్వీట్ చేశారు