తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి విడతలో ఇండ్లు రానివారు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. మొదటి విడతగా ప్రతీ నియోజక వర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇవికాక, మరో నాలుగు విడతల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భూభారతి వచ్చిన దరఖాస్తులను ఈనెల 30వ తేదీలోగా పరిష్కరిస్తామని అన్నారు.