TG: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను గౌరవిస్తామని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వెల్లడించారు. 4 వారాల్లో పూర్తి సమాచారం సమర్పిస్తామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో అదాని కంపెనీ 2.72 లక్షల ఎకరాల్లో 92,000 చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికి వేసిందని ఆరోపించారు. ఈ అక్రమ నరికివేతపై కూడా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.