ప్రతి ఏడాది 3500 ఇళ్లు మంజూరు చేస్తాం: భట్టి(వీడియో)

62చూసినవారు
ప్రతి ఏడాది 3500 ఇళ్లు మంజూరు చేస్తాం: భట్టి(వీడియో)
TG: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ దిశగా దృష్టి సారించిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో ఇంటికి రూ.5 లక్షలతో ప్రతి ఏడాది 3500 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్