AP: గంజాయి, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని హోంశాఖ మంత్రి అనిత వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ.. ఏజెన్సీల్లో పండే గంజాయి స్కూల్ బ్యాగుల్లోకి వచ్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి బ్యాచ్ వారి ఆస్తులు, ఐడెంటిటీలు సీజ్ చేస్తామని హోంమంత్రి హెచ్చరించారు. రాజమండ్రి, విజయవాడ దగ్గర ఎక్కువగా బ్లేడ్ బ్యాచ్ లను గుర్తించినట్లు ఆమె చెప్పారు.