భూ భార‌తి ట్రిబ్యున‌ల్ ఏర్పాటు చేస్తాం: మంత్రి దామోదర

55చూసినవారు
భూ భార‌తి ట్రిబ్యున‌ల్ ఏర్పాటు చేస్తాం: మంత్రి దామోదర
TG: ధ‌ర‌ణి పోర్టల్ వ‌ల్ల రైతులు నిద్ర‌లేని రాత్రులు గ‌డిపారని మంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. సంగారెడ్డి (D) కొండాపూర్ మండల కేంద్రంలో భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ పై రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులు నచ్చిన, మెచ్చిన చట్టం భూ భారతి రెవిన్యూ చట్టం. భూ భార‌తి ట్రిబ్యున‌ల్ ఏర్పాటు చేస్తాం. ప‌ట్టాదారు పాసు పుస్త‌కంలో భూక‌మ‌తాల మ్యాపులను ముద్రిస్తాం' అని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్