పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు పూర్తి మద్దతు అందిస్తామని తెలిపారు. ప్రాంతీయ స్థిరత్వానికి కట్టుబడి ఉన్నామని, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరువాత చైనా సపోర్ట్ చేస్తానని చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.