తెలంగాణ అసెంబ్లీలో BRS, కాంగ్రెస్ సభ్యల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై BRS నేత జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. స్పీకర్‌కు సభ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన హరీశ్ రావు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ఎందుకు నిరసన చేశారో, సభను ఎందుకు వాయిదా వేశారో తెలియదని ఎద్దేవా చేశారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయకపోతే అవిశ్వాసం పెడతామన్నారు.