బలహీన పడిన ‘రెమాల్‌’

73చూసినవారు
బలహీన పడిన ‘రెమాల్‌’
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్‌’ తుపాను సోమవారం ఉదయం నుంచి బలహీన పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లో తీరం దాటిన తర్వాత తుపాను విధ్వంసం సృష్టించింది. తీరం దాటే సమయంలో తుపాను దాటికి బెంగాల్‌ వణికిపోయింది. 135 కి.మీ వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. మరోవైపు రాష్ట్ర, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్