AP: సంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఇసుక స్కాంలు జరుగుతున్నాయి. మా హయాంలో కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం షాపులు ప్రైవేయిటైజ్ చేశారు. ఆ వ్యవహారం ఎలా సాగిందో రాష్ట్రం మొత్తం చూసింది. ఇసుక, మద్యం, ఫ్లై యాష్.. ఇలా అన్ని మాఫియాలే’ అని జగన్ ఆరోపించారు.