కరుంగలి మాలను ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ధరిస్తున్నారు. అయితే ఈ మాల ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తుందని పురోహితులు చెబుతున్నారు. కరుంగలి మాల ధరించడం వల్ల నెగటివ్ ఎనర్జీని తొలగించి, సానుకూల శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇది ధరించిన వారి చుట్టూ రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది. చెడు దృష్టి, దుష్ట శక్తుల నుంచి కాపాడుతుందని నమ్మకం. అలాగే శరీరంలో వేడిని తగ్గిస్తుంది, మానసిక శాంతిని ఇస్తుంది.