పొట్టి దుస్తులు ధరించడంపై ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది బార్‌లో అశ్లీల నృత్యం చేసిన పలువురు బార్ డ్యాన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు పొట్టి దుస్తులు ధరించి డ్యాన్సులు చేయడం నేరం కాదని ఏడుగురు బార్ డ్యాన్సర్లను నిర్దోషులుగా ప్రకటించింది. డ్యాన్స్ వల్ల ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకోవచ్చని తీర్పు చెప్పింది.