ఉదయం పెళ్లి జరగ్గానే, మధ్యాహ్నం ఓ వధువు ప్రియుడితో పారిపోయిన ఘటన తమిళనాడులో జరిగింది. పెరంబూరుకు చెందిన అర్చనకు చెన్నైకు చెందిన విజయ్ కుమార్‌తో జులై 2న పెళ్లి జరిగింది. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని చెప్పిన అర్చన, ప్రియుడు కళయరసన్‌తో పరారైంది. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వచ్చి వరుడికి సారీ చెప్పింది. వివాహ ఖర్చులు ఇచ్చేందుకు ఆమె కుటుంబం అంగీకరించింది.