కాంగ్రెస్ పార్టీ తరఫున, వ్యక్తిగతంగా KTR, హరీశ్ రావు పాదయాత్రని స్వాగతిస్తున్నానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 'రేపు అసెంబ్లీ ఎన్నికలు పెడితే 100 సీట్లు గెలుస్తారట. బావ బామ్మర్దులు బయలుదేరారు పాదయాత్ర చేస్తారట. పదేళ్లు పాలన చేసిన మీ నాయన, మీరు ఏ ఒక్కరోజు ప్రజల మధ్యకు రాలే. 4 గోడల మధ్య నుండే పరిపాలన కొనసాగించారు. మీరొక్కసారి తెలంగాణ రాష్ట్రం తిరగడమే మంచిది. మీ పాలన ఎలా ఉందో తెలుస్తుంది' అని విమర్శించారు.