TG: కుల గణన సర్వే నివేదిక లెక్కల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పథకాల రూపకల్పన చేస్తుందని కులగణన కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాలులో బీసీ కులగణనపై MLAలకు, MLCలకు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కుల గణన సర్వే మీద కొందరు అపోహలు.. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. కుల గణన సర్వే ఎలా జరిగిందనేది ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ వివరిస్తుందన్నారు.