నితిన్ ప్రధాన పాత్రలో రూ.75కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ ‘తమ్ముడు’. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.3కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో రూ.2కోట్ల కలెక్షన్లు వచ్చాయని వెల్లడించాయి. ఈ చిత్రానికి మొదటిరోజు 27వేల లోపే టికెట్లు అమ్ముడుపోయాయని పేర్కొన్నాయి. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఉదయం షోలతో పోలిస్తే సాయంత్రానికి ఆక్యుపెన్సీ తగ్గినట్లు తెలిపాయి.