ఢిల్లీ రంజీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లిని రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ ఔట్ చేసిన విషయం తెలిసిందే. బాల్ ఇన్‌స్వింగ్ రాగా విరాట్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. బౌలర్ సాంగ్వాన్ ఓ ఇంటర్వ్యూలో నాటి విశేషాలను పంచుకున్నాడు. ‘మ్యాచ్ ముగిశాక విరాట్ వద్దకు వెళ్లాను. ఔట్ చేసిన బంతిపై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోహ్లిని కోరగా.. అద్భుతమైన డెలివరీతో ఔట్ చేశావంటూ ప్రశంసించారు’ అని సాంగ్వాన్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ 6 పరుగులకే ఔటయ్యారు.