విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇచ్చిన హామీ ఏమైంది: బండి సంజయ్

78చూసినవారు
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇచ్చిన హామీ ఏమైంది: బండి సంజయ్
తెలంగాణ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని.. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్