గరుడ పురాణం ప్రకారం, చనిపోయిన వ్యక్తి దుస్తులను కుటుంబసభ్యులు, వారికి దగ్గరగా ఉన్నవారు పొరపాటున కూడా ధరించకూడదు. మరణించిన వ్యక్తి దుస్తులు ఆత్మలను త్వరగా ఆకర్షిస్తాయి. అది పాజిటివ్ ఎనర్జీని తగ్గించి చెడు ప్రభావాలను కలిగిస్తుంది. వారి బట్టలు ధరించడం వల్ల ఆ ఆత్మ బంధాలు తెంచుకోలేక ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటుంది. అయితే, ఆ దుస్తులను తెలియని వ్యక్తులకు దానం చేయొచ్చు. దీని వల్ల ఎవరికీ హాని కలగదు.