జీబీఎస్ సాధారణంగా వ్యాపించేదే నరాల సంబంధిత వ్యాధి. ఇది అంటు వ్యాధి కాదు. కలుషిత నీరు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో తొలుత నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ప్రతి అవయవాన్ని నియంత్రించే మెదడు ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి ఆదేశాలను పంపే నరాలపై ఉండే మైలీన్ పొర దెబ్బతిని మెదడు నుంచి వచ్చే సంకేతాలు అందకపోవడంతో అవయవాలు చచ్చుబడి అచేతనమవుతాయి.