సంప్రదాయాల ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ (నార్త్ బ్లాక్)కు చెందిన నేలమాళిగలో బడ్జెట్ ప్రతులను రహస్యంగా ముద్రిస్తారు. ఈ నేల మాళిగలోనే స్వయంగా ఆర్థిక మంత్రి 'హల్వా' వేడుకను నిర్వహిస్తారు. బడ్జెట్ను పార్లమెంటులో సమర్పించడానికి 9-10 రోజుల ముందు ఈ వేడుక జరుగుతుంది. బడ్జెట్ తయారీలో సహకరించిన సభ్యుల కృషిని గుర్తిస్తూ ఈ వేడుక నిర్వహిస్తారు. బడ్జెట్ లీకేజీలు లేకుండా చూడాలనే లక్ష్యంతో హల్వా వేడుకను నిర్వహిస్తుంటారు.