యోగా అనే పదం సంస్కృతంలోని "యుజ్" నుండి వచ్చింది. దీనికి అర్థం "కలయిక" లేదా "సమన్వయం". ఇది ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, జీవన విధానాన్ని కలిపి ఒక సమగ్ర వ్యవస్థగా ఉంటుంది. యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట. మానసిక శక్తులను ఏకం చేసి ఏకాగ్రత సాధించడం ద్వారా జీవన బంధాలను తొలగించి, పరమ సత్యాన్ని చేరుకోవడమే యోగం. యోగము అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి.