మిరప పంట కోతకు కనీసం 15 నుంచి 20 రోజుల ముందు నుంచి ఎటువంటి పురుగు మందులు, రసాయనాలకు పిచికారీ చేయకూడదు. ఒకవేళ పిచికారీ చేసినట్లయితే మిరప కాయల మీద అవశేషాలు ఉండే ప్రమాదముంది. అందుకే వారం లేదా పది రోజులు ఆగి పంటను కోయాలి. అలాగే కోతకు ముందు పంటకు నీటి తడులు ఇవ్వరాదు. మిరపకాయల్ని మొక్క మీదే ఎక్కువగా పండనీయకూడదు. దీనివల్ల కాయలు ముడతలు పడి సూర్యకాంతి ఎక్కువగా పడటం వల్ల రంగు తగ్గి నాణ్యత కోల్పోతాయి.