డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు జాగ్రత్తగా మందులు వాడాల్సిందే. ఈ సమయంలో పెయిన్‌కిల్లర్ మందులు వాడొద్దు. రక్తపోటును తగ్గిస్తుంది. రక్త పరీక్ష చేయించుకుంటే డెంగ్యూ అవునో కాదో తేలిపోతుంది. జ్వరం తగ్గిన తర్వాత చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా, కడుపునొప్పి ఉండటం, వాంతులు కావడం లాంటి లక్షణాలు కనిపించగానే వైద్యుల దగ్గరకు వెళ్లాలి. జ్వరం రాగానే ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఆహారం, పండ్లు తీసుకోవాలి. 10-20 వేల కంటే తక్కువకు ప్లేట్‌లెట్లు పడిపోయినపుడే వాటిని ఎక్కించాలి.