పాము కరిచిన చోట ఏం చేయాలి?

73చూసినవారు
పాము కరిచిన చోట ఏం చేయాలి?
ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. పాము కాట్లను పరిశీలించి, గుర్తిస్తే చాలు. రెండు లేదా మూడు గాట్లుంటే విషసర్పమనీ, ఎక్కువ గాట్లుంటే మామూలు పామని గుర్తించొచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పాము కరిచిన భాగాన్ని కడగటం, రుద్దటం చేయొద్దు. పాము కాటు వద్ద నోరు పెట్టి రక్తాన్ని పీల్చి ఉమ్మేయటం సినిమాల్లో చూపిస్తుంటారు. ఇది మంచి పని కాదు. విషపూరిత రక్తాన్ని మొత్తం పీల్చేయటం అసాధ్యం. ఒకవేళ నోట్లో చిన్న పుండున్నా పీల్చేవారికీ ప్రమాదమే.

సంబంధిత పోస్ట్