ఏపీలో ‘వాట్సాప్ గవర్నెన్స్’ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా దీనికి శ్రీకారం చుట్టింది. ఇందులో తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలు అందిస్తున్నారు. దేవదాయ, ఇంధన, ఏపీఎస్‌ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలయ్యాయి. దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 95523 00009ను కేటాయించారు.