గోధుమ గడ్డి రసం ఆరోగ్య ప్రియులకు ఎంతో ఇష్టమైన పానీయం. ఇందులో క్లోరోఫిల్, విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. గోధుమ గడ్డి రసం డయాబెటిస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ రసం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గిస్తుంది. దీనిలోని గుణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.