TG: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పెన్షన్ల పెంపుతో పాటు కొత్తవారికి మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఏడాదిన్నర అవుతున్నా అమలు చేయలేదు. క్షేత్రస్థాయి పరిశీలన, అనర్హుల తొలగింపు, అర్హుల గుర్తింపు అంటూ కాలయాపన చేస్తోందని అర్హులు వాపోతున్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.2 లక్షల మందికి పెన్షన్ల కొసం ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల నుంచైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.