TG: రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్కీం ద్వారా రైతులకు సంవత్సరానికి మూడు విడతలలో రూ. 6,000 (ప్రతి విడత రూ. 2,000) నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటివరకు 19 విడతల్లో నగదు అందజేశారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం.. 20వ విడత డబ్బులు ఈనెల 10వ తేదీ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.