పూరీ రత్నభాండాగారాన్ని తెరిచేది ఎప్పుడంటే?

63చూసినవారు
పూరీ రత్నభాండాగారాన్ని తెరిచేది ఎప్పుడంటే?
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయం కింద రత్నభాండాగారాన్ని ఈ నెల 14న తెరవాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు రథ్ తెలిపారు. 'ఈ 14న గదిని తెరిపించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. ముందుగానే గది తాళం ఇవ్వాలని క్షేత్ర పాలనాధికారికి చెప్పాం. రథయాత్ర కారణంగా అది సాధ్యం కాలేదు. మా నిర్ణయాలను ఆలయ కమిటీకి పంపుతాం. వారు ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తారు' అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్