మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందో గరుడ పురాణంలో చెప్పబడింది. జీవుడు చేసిన పాపపుణ్యాలు అతని ఆత్మ ప్రయాణాన్ని నిర్ణయిస్తాయని ఇందులో పేర్కొన్నారు. గరుడ పురాణం ప్రకారం.. "మరణం తర్వాత ఆత్మ యమలోకానికి తీసుకెళ్లబడుతుంది. అక్కడ యమధర్మరాజు ముందు ఆత్మ పాపపుణ్య కార్యాలను లెక్కపెడతారు. పాపాలు ఎక్కువగా ఉంటే యమదూతలు ఆత్మను శిక్షిస్తారు. పుణ్యాలు ఎక్కువ ఉంటే ఆత్మ స్వర్గానికి చేరుకుంటుంది."