ముంబయి ఉగ్రదాడి కుట్రదారు తహవూర్ రాణా NIA కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీలోని ఎన్ఐఏ భవనంలోని 14 X 14 అడుగుల వైశాల్యంలో ఒక చిన్న గదిలో 24 గంటల నిఘా కోసం సీసీ కెమెరాలు అమర్చారు. ఆ గదిలో వివిధ అంచెల్లో డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అతడు పడుకోవడానికి నేలపై బెడ్ వేశారు. ఆహారం, తాగునీరు, వైద్యసదుపాయాలు అన్నీ ఆ గదికే వస్తాయని తెలుస్తోంది. కేవలం 12 మంది ఎన్ఐఏ అధికారులకు మాత్రం అనుమతి ఇచ్చారు.