కులగణనతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. 'కులగణన జరిపిన విధానమే సరిగా లేదు. సర్వే లెక్కలన్నీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కులాల, మతాల ఆధారంగా ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్ గాంధీకి అలవాటే. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది. ముస్లింలందరినీ బీసీల్లో కలిపి బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తుంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం' అని ఫైర్ అయ్యారు.