వారెవ్వా.. సైకిళ్లపై పోలీసుల పెట్రోలింగ్ (వీడియో)

72చూసినవారు
TG: హనుమకొండ జిల్లా భీమదేవర మండలంలోని వంగర పోలీసులు ఆదర్శంగా నిలిచారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సైకిళ్లపై గ్రామ సందర్శన చేశారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వినూత్న రీతిలో SI దివ్య తన సిబ్బందితో కలిసి సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహించారు. 6 గ్రామాల్లో ప్రజలతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్