ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా పాకిస్థాన్‌కి చెందిన మోహ్సిన్ నఖ్వీ నియమితులయ్యారు. శ్రీలంక క్రికెట్ (SLC) అధిపతి షమ్మీ సిల్వా స్థానంలో నఖ్వీ నియమితులయ్యారు. నఖ్వీ ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు. 2024 ప్రారంభం నుండి నఖ్వీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవితో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా కొనసాగనున్నారు.