థాయ్‌లాండ్‌కు చెందిన చమో తప్యాసో ప్రపంచంలోనే అత్యధికంగా జైలుశిక్ష పడిన నేరస్థురాలిగా చర్రితలో నిలిచింది. ఆమెకు 1989 జులై 27న ఆ దేశ కోర్టు 1,41078 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చమో 1960లో చిట్‌ఫండ్ వ్యాపారం మొదలుపెట్టింది. ఆ తర్వాత పిరమిడ్ స్కీమ్‌ను ప్రారంభించి.. 16వేల మంది నుంచి దాదాపు రూ.15వేల కోట్లకు పైగా మోసం చేసిందట. విచారణ జరిపిన కోర్టు ఆమె ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు తేల్చి శిక్ష ఖరారు చేసింది.