పాకిస్తాన్ కు చెందిన ఖమర్ షేక్ రెండు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాఖీ కడుతున్నారు. కరాచీలో జన్మించిన ఖమర్ షేక్ 1981లో వివాహం చేసుకున్న తర్వాత భారత్ కు వలస వచ్చారు. సుమారు 35 ఏళ్ల క్రితం అప్పటి గుజరాత్ గవర్నర్ సరూప్ సింగ్ ద్వారా ఆమె ప్రధాని మోదీని కలిశారు. ఖమరు సరూప్ సింగ్ తన కుమార్తెగా భావించేవారు. షేక్ తన సోదరి అని ప్రధాని మోదీ ఆ సమయంలో చెప్పారు. అప్పటి నుంచి ఆమె మోదీకి రాఖీ కడుతున్నారు.