పునరుద్ధరించిన జాతీయ భద్రతా సలహా బోర్డు (ఎన్ఎస్ఏబీ) అధిపతిగా ఇటీవల అలోక్ జోషీ నియమితులయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్ నిర్మించింది. బోర్డు ఛైర్మన్‌గా భారత నిఘా విభాగం 'రా' మాజీ అధిపతి ఆలోక్ జోషిని నియమించింది. 15 మంది సభ్యులతో కూడిన ఎన్ఎస్ఏబీ పనిచేస్తుంది.