శాసనసభ సమావేశాలకు ముందే మణిపూర్ సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ వెంటనే సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆదేశాలిచ్చారు. అనంతరం తదుపరి CMపై రాష్ట్ర బీజేపీ నేతలు పార్టీ అధిష్ఠానంతో సంప్రదింపులు జరిపారు. సీఎం అభ్యర్థిపై రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వైపే కేంద్రం మొగ్గుచూపింది. మోడీ విదేశీ పర్యటన అనంతరం సీఎం అభ్యర్థి ఎవరో తేలనుంది.