తెలంగాణలో ఉన్న కోటి మంది మహిళలు ఎవరికి ఓటు వేస్తే వాళ్లు గెలుస్తారని CM రేవంత్ వ్యాఖ్యానించారు. HYDలో నిర్వహించిన వి హబ్ వుమెన్స్ యాక్సిలరేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. 'మహిళా సంఘాల్లో 67 లక్షల మంది సభ్యులున్నారు. వాళ్లు కోటి మంది కావాలి. మా వాళ్లు ఓటు వేయకపోయినా మీ కోటి మంది మహిళలు అనుకుంటే ప్రభుత్వాన్ని నిర్ణయించగలరు. ఉచిత బస్సు పథకం ద్వారా ఒక్కో మహిళకు దాదాపు రూ.5000 వరకు ఆదా అవుతోంది' అని తెలిపారు.