TG: వరంగల్‌లో కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్ కంపెనీలతో ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లు, దుకాణాలను ఎందుకు కూల్చుతున్నారని.. వారి జీవితాలను బుల్డోజర్ల కింద ఎందుకు నలిపేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు Xలో కూల్చివేతల వీడియో పోస్ట్ చేశారు.