ఆర్మీ లీగల్ బ్రాంచ్‌లో మహిళల సంఖ్య ఎందుకు తక్కువగా ఉందని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. భారత వైమానిక దళంలో మహిళలు రఫేల్ నడపగలిగినప్పుడు ఇక్కడ మాత్రం తేడా ఎందుకని వ్యాఖ్యానించింది. జడ్జి అడ్వకేట్ జనరల్ పోస్టుల కేసును ఇటీవల విచారించిన కేంద్రం.. పురుషుల కన్నా మెరిట్ ఎక్కువగా ఉన్నా తమను ఎంపిక చేయలేదని అష్నూర్ కౌర్, అస్థ త్యాగి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఈ మేరకు స్పందించింది.