అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందారు. ఆయన అసలు లండన్‌కు ఎందుకు వెళ్లాలనుకున్నారని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే లండన్‌లో ఉన్న ఆయన భార్య అంజలిబెన్ రూపానీని తిరిగి తీసుకురావడానికి లండన్ వెళ్లాలనుకున్నట్లు రూపానీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రూపానీ బిజినెస్ క్లాస్ విభాగంలో 2-Dలో కూర్చున్నట్లు విమాన రికార్డులు నిర్థారించాయి.